అన్ని ఏర్పాట్లు చేయండి
దుద్యాల్: పోలేపల్లిలో వెలసిన శ్రీరేణుక ఎల్లమ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హెలిపాడ్ వద్ద జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశ్, ఈఓ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ నాయకులు మేరుగు వెంకటయ్య, ఆకారం వేణుగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు నర్సిములు, ముని కుమార్, రాములు, వెంకటయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు.


