బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Feb 10 2026 9:51 AM | Updated on Feb 10 2026 9:51 AM

బీజేప

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

తాండూరు: బీజేపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన పార్టీ 11వ వార్డు అభ్యర్థి ఇందూర్‌ రాములు తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మురుగు కాల్వలు నిర్మించా

తాండూరు: ఓటు వేసి గెలిపిస్తే మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి 10వ వార్డులో ప్రచారం చేశారు. గతంలో సీసీరోడ్లు, మురుగు కాల్వలను నిర్మించానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు.

ప్రశాంత్‌ విజయం ఖాయం

కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 4వ వార్డు అభ్యర్థి నందారం ప్రశాంత్‌ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అభ్యర్థి తరఫున గుండ్లకుంట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, కాంగ్రెస్‌కు ఓటు వేసి అభివృద్ధిని ఆస్వాదించాలని కోరారు.

కాంగ్రెస్‌.. అభివృద్ధికి మారుపేరు

పరిగి: కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అభివృద్ధికి మారుపేరు అని ఎమ్మెల్యే సతీమణి ఉమారామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆమె పార్టీ 5వ వార్డు అభ్యర్థి షాహెదాబేగం తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్‌ అఽధికారం చేపట్టాక సంక్షేమం పరుగులు తీస్తోందని చెప్పారు. మరింత అభివృద్ధి జరగాలంటే పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ప్రజా సంక్షేమం..

బీఆర్‌ఎస్‌ లక్ష్యం

తాండూరు టౌన్‌: ప్రజాసంక్షేమమే బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని వికారాబాద్‌ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ప్రమోదిని అన్నారు. పార్టీ పట్టణ 24వ వార్డు అభ్యర్థి కొట్రిక నాగలక్ష్మి తరఫున సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నాగలక్ష్మిని గెలిపించాలని కోరారు.

అందుబాటులో ఉంటా..

తాండూరు: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ 16వ వార్డు అభ్యర్థి నారా శ్రీలత అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆమె పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ఆదరిస్తే.. అందుబాటులో ఉండి, సేవ చేసుకుంటానని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. .

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
1
1/4

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
2
2/4

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
3
3/4

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
4
4/4

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement