బాలికపై లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారం | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారం

Feb 10 2026 9:51 AM | Updated on Feb 10 2026 9:51 AM

బాలికపై లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారం

బాలికపై లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారం

అనంతగిరి: వికారాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువర్చిందని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 2023లో వికారాబాద్‌ మండలానికి చెందిన అత్వెల్లి నరేందర్‌ (అలియాస్‌ నరేష్‌) అనే వ్యక్తి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్‌ మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌ చంద్రకిశోర్‌ సమక్షంలో విచారణ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన శాసీ్త్రయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడిపై నేరం రుజువు కావడంతో పైశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పరంగా రూ.5 లక్షల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

మొయినాబాద్‌: స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మృగవని రిసార్ట్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని బాగ్‌లింగంపల్లికి చెందిన ప్రకాశ్‌సింగ్‌ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన బంధువుల సంగీత్‌ వేడుకకు వచ్చారు. ప్రకాశ్‌సింగ్‌ కుమారుడు సూర్యప్రకాశ్‌(10) ఆడుకుంటూ రిసార్ట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ వైపు వెళ్లి అందులో పడి నీటమునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, రిసార్ట్స్‌, ఫాంహౌస్‌లలోని స్విమ్మింగ్‌ పూల్‌లలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్‌ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement