దేవర్‌ఫసల్వాద్‌కు జాతీయ అవార్డు
● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ
దౌల్తాబాద్: జాతీయ అవార్డుకు ఎంపికై న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ తెలిపారు. మండలంలోని దేవర్‌ఫసల్వాద్ గ్రామం సామాజిక న్యాయం–భద్రత కింద జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో సోమవారం గ్రామంలో స భ నిర్వహించారు. వసతులు, సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీ పీఓ జయసుధ మాట్లాడుతూ..గామం జాతీ య అవార్డుకు ఎంపిక కావడంతో భారీగా ని ధులు వస్తాయన్నారు. తాగునీరు, పచ్చదనం, జీవానోపాధి వంటివి మెరుగు పడతాయన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీ ఎం వెంకటన్న, ఏపీఓ అంజిలయ్య, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు జరగొద్దు
అనంతగిరి: పోలింగ్ సామగ్రి పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సిబ్బందికి అందజేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆదేశించారు. వికారాబాద్ పట్టణంలోని మేరీ నాట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సోమవారం సందర్శించారు. ఇక్కడి సదుపాయాలను పరిశీలించారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజ న వసతి, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందించాలన్నారు. సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేయరాదని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రచారం చేయరాదని తెలిపారు. ఇంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
పోలింగ్ సిబ్బందికి
విధుల కేటాయింపు
అనంతగిరి: పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ రవి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఈఓ రేణుకాదేవి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రచారం చేయరాదని సూచించారు. పోలీస్ అధికారులు, ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలన్నారు.
దేవర్‌ఫసల్వాద్‌కు జాతీయ అవార్డు
దేవర్‌ఫసల్వాద్‌కు జాతీయ అవార్డు
దేవర్‌ఫసల్వాద్‌కు జాతీయ అవార్డు


