గుడ్ గవర్నెన్స్‌కు మోత్కుపల్లి జీపీ నామినేటెడ్
బంట్వారం: కోట్‌పల్లి మండలం మోత్కుపల్లి పంచాయతీని 2023 – 24 ఆర్థిక సంవత్సరం స్కోర్ ఆధారంగా గుడ్ గవర్నెన్స్‌కు నామినేటెడ్ చేసినట్లు డీఎల్‌పీఓ సంధ్యారాణి తెలిపారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై వీడియో చిత్రీకరణ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటి పన్నుల వసూలు, ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందన్నారు. వీటి స్కోర్ ఆధారంగానే పంచాయతీని గుడ్ గవర్నెన్స్‌కు నామినేటెడ్ చేయడం జరిగిందన్నారు. ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హే మంత్, సర్పంచ్ అమృతమ్మ, ఉప సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
డీఎల్‌పీఓ సంధ్యారాణి


