గుల్బర్గా టు వికారాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

గుల్బర్గా టు వికారాబాద్‌

Feb 10 2026 9:51 AM | Updated on Feb 10 2026 9:51 AM

గుల్బ

గుల్బర్గా టు వికారాబాద్‌

తాండూరు: తొలుత తాండూరు.. నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో కొనసాగింది. నాడు తాలూకా తహసీల్దారులే పాలన కొనసాగించేవారు. కాలక్రమేణా నిజాం సంస్థానం 1952లో దేశంలో విలీనం కాగా.. 1953లో తాండూరు పట్టణం సుమారు 4 వేల మంది ఓటర్లతో పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. నాటి నుంచి 2010 వరకు మూడో శ్రేణి మున్సిపాలిటీగా కొనసాగింది. ఇదే ఏడు ప్రభుత్వం ద్వితీయ శ్రేణిగా పదోన్నతి(అప్‌గ్రేడ్‌) చేసింది. 1953 నుంచి 2005 సంవత్సరం వరకు మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉండగా.. 2005లో జరిగిన ఎన్నికల్లో వార్డుల విభజనతో ఆ సంఖ్య 27కు చేరింది. 2014లో మరోసారి వార్డుల విభజన జరగడంతో 31కి చేరింది. 2019లో శివారు ప్రాంతాలను విలీనం చేయగా.. ప్రస్తుతం 36 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

తొలి చైర్మన్‌గా ‘ముదెళ్లి’

మున్సిపాలిటీ ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా 1953 నవంబర్‌ 25న జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముదెళ్లి నారాయణరావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గుల్బర్గా జిల్లా హైదరాబాద్‌ సంస్థానం(నిజాం స్టేట్‌)లో ఉండేది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో గుల్బర్గా జిల్లా నుంచి తాండూరు వీడిపోయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దు పరిధి(హైదరాబాద్‌)లోకి వచ్చింది. నాడు హైదరాబాద్‌ జిల్లాలో నగర పాలక సంస్థ, ఏకై క పురపాలకసంఘం తాండూరు ఒక్కటే కావడం విశేషం.

2014లో వికారాబాద్‌లో విలీనం

1978లో హైదరాబాద్‌ జిల్లాను రెండుగా విభజించి, హైదరాబాద్‌ పట్టణాన్ని ఒక జిల్లాగా, నగర చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడాఏకై క మున్సిపాలిటీ తాండూరే. జిల్లా ఆవిర్భావం తరువాత కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాను విభజించగా.. పురపాలక సంఘం వికారాబాద్‌ జిల్లాలో విలీనం అయింది.

9 సార్లు ఎన్నికలు.. 14 మంది చైర్మన్లు

మున్సిపాలిటీకి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే అధికంగా చైర్మన్‌గా కొనసాగారు. 1954 నుంచి 9 సార్లు ఎన్నికలు జరగగా.. 6 సార్లు ఆ పార్టీ ఏలగా.. ఒకసారి బీజేపీ, రెండు సార్లు బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు కలసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేశాయి. కాగా 9 సార్లు జరిగిన ఎన్నికల్లో 9 మంది చైర్మన్‌లను ఎన్నుకున్నారు. రెండు మూడు సార్లు చైర్మన్‌కు ప్రత్యేక్ష ఎన్నికలు జరిపి, నేరుగా ఎన్నుకున్నారు. కొందరు అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. మొత్తం 14 మంది చైర్మన్లు కొనసాగారు.

నాటి నుంచి అ విశ్వాస పరీక్షే..

తొలి చైర్మన్‌ నారాయణరావు పాలన సాఫీగా సాగింది. 1959లో ఎన్నికల్లో పుల్లా అనంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానంతో పార్వతప్ప, శెట్టి చంద్రశేఖర్‌లు పదవిలో కొనసాగారు. 1981 ఎన్నికల్లో తిరిగి అనంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఏడాది తర్వాత కౌన్సిల్‌ సభ్యుల అవిశ్వాస తీర్మానంతో బీజేపీకి చెందిన సత్తయ్యగౌడ్‌ కొనసాగారు. ఆయనపై అవిశ్వాసం పెట్టడంతో అనంత్‌రెడ్డి సోదరుడు పుల్లా మోహన్‌రెడ్డి కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మేజార్టీ రాక పోవడంతో బీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. మొదట టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం రావడంతో కొట్రికె విజయలక్ష్మి రెండున్నరేళ్ల అనంతరం రాజీనామా చేశారు. చైర్మన్‌ ఎన్నికల్లో అనుహ్యూంగా కౌన్సిల్‌ సభ్యుల మద్దతు పొంది.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సునితసంత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికయ్యారు. 2020లో ఏర్పాటైన కౌన్సిల్‌లో సైతం ఫిఫ్టి ఫిఫ్టి ఒప్పందంతో తాటికొండస్వప్న, పట్లోల్ల దీపిక నర్సింహులు చెరోసగం ఐదేళ్ల పరిపాలించారు.

18 ఏళ్లు ప్రత్యేక పాలన

మున్సిపాలిటీ ఆవిర్భవించిన 7 దశాబ్దాల చరిత్రలో సుమారు 20 ఏళ్లు పాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇందుకు కారణం ప్రభుత్వాలు ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపక పోవడమేనని తెలుస్తోంది. దీంతో 18 సంవత్సరాలు ప్రత్యేక పాలన జరిగింది.

నిజాంకాలంలో వెలుగొందిన తాండూరు

1953లో 23వార్డులతో

మున్సిపాలిటీ ఏర్పాటు

ప్రస్తుతం 36 డివిన్లతో

ద్వితీయ శ్రేణిగా అప్‌గ్రేడ్‌

తొలి చైర్మన్‌గా నారాయణరావు

నాటి నుంచి బల్దియాలో

రాజకీయ చైతన్యం

36 వార్డులు..

77,025 మంది ఓటర్లు

మున్సిపాలిటీ ఆవిర్భవించిన సమయంలో సుమారు 4వేల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 77,025 మంది ఓటర్లు ఉండగా..అందులో పురుషులు 37,499, మహిళలు 39,525 మంది ఉన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌లుగా కొనసాగిన వారు వీరే..

15వ పీఠం ఎవరికో

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది. కానీ 2017లో అప్పటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయ లక్ష్మిని రాజీనామా చేయించి, ఎంఐఎం పార్టీకి చైర్మన్‌గా చేసేందుకు కౌన్సిల్‌ సభ్యులతో అవిశ్వాస తీర్మానం చేశారు. అందులో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న సునితసంపత్‌కు మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు లభించడంతో.. చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2020లో బీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను గెలిచి తాటికొండ స్వప్నపరిమళ్‌ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు కొనసాగారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీ 15 సారి చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

గుల్బర్గా టు వికారాబాద్‌1
1/3

గుల్బర్గా టు వికారాబాద్‌

గుల్బర్గా టు వికారాబాద్‌2
2/3

గుల్బర్గా టు వికారాబాద్‌

గుల్బర్గా టు వికారాబాద్‌3
3/3

గుల్బర్గా టు వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement