సప్పుడు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

సప్పుడు బంద్‌

Feb 10 2026 9:50 AM | Updated on Feb 10 2026 9:50 AM

సప్పు

సప్పుడు బంద్‌

ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో ఇళ్ల వద్దకు అభ్యర్థులు ప్రలోభాల పర్వం షురూ.. మద్యం, డబ్బు పంపిణీకి ఏర్పాట్లు 11న పోలింగ్‌.. 13న కౌంటింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

తూతూమంత్రంగా తనిఖీలు

రాజకీయ పార్టీలు ఓటరు స్లిప్పులు పంచరాదని అధికారులు చెబుతున్నా నేతలు పట్టించుకో వడం లేదు. పంపిణీ పేరుతో ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. డబ్బు, మద్యం ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రలోభాల విషయంలో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతున్నా.. యథేచ్ఛగా ప్రలోభాల పర్వం సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అభ్యర్థులు ప్రతి కాలనీలో రెండు మూడు చోట్ల టెంట్లు వేసి ఓటర్లకు కావాల్సిన భోజనం తయారు చేయించి పెడుతున్నారు. చెక్‌ పోస్టుల వద్ద కూడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు.

వికారాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం చేశారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్యే ఉంది. కొన్ని చోట్ల బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రచారం ముగియడంతో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను డబుల్‌ చేశారు.

గెలుపే పరమావధిగా..

ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయం అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పార్టీలు వారం రోజులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి సురక్షిత ప్రాంతాల్లో డంప్‌ చేసినట్టు సమాచారం. ఖరీదైన బ్రాండ్లు కూడా నిల్వ చేసినట్లు తెలిసింది. ఓటర్లు ఏ బ్రాండ్‌ మద్యం అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వ్యక్తుల స్థాయిని బట్టి, వారు చేసే వృత్తులు, హోదాలను బట్టి మద్యం బ్రాండ్లు పంపిణీ చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు పట్టులేని చోట్ల డబ్బు ఎర వేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఓటుకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న అన్‌ రిజర్వ్‌డ్‌ వార్డుల్లో ఎంత ఖర్చు చేయడానికై నా వెనుకాడటం లేదు. గెలుపే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకున్నాయి. ఈ నెల 11న పోలింగ్‌ ఉండడంతో ఒకరోజు ముందుగా భారీగా ప్రలోభాలకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటర్లూ జర జాగ్రత్త

ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధంతో స మానం. మన ఐదేళ్ల భవిష్యత్‌కు సంబంధించినది. విజ్ఞతతో ఆలోచించి సేవ చేసే వారికే ఓటు వేయా లని మేధావులు సూచిస్తున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మంచివారిని ఎన్నుకోవాలంటున్నారు.

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

సప్పుడు బంద్‌1
1/2

సప్పుడు బంద్‌

సప్పుడు బంద్‌2
2/2

సప్పుడు బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement