మామా మజాకా | - | Sakshi
Sakshi News home page

మామా మజాకా

Feb 10 2026 9:51 AM | Updated on Feb 10 2026 9:51 AM

మామా మజాకా

మామా మజాకా

తాండూరు టౌన్‌: అల్లుడి గెలుపు కోసం అతని మామ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 13వ వార్డు అభ్యర్థి సురేష్‌ నాయక్‌కు మద్దతుగా ఆయన మామ విఠల్‌ నాయక్‌ సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. అల్లున్ని ఆదరిస్తే.. తన వినాయక ఫంక్షన్‌ హాల్‌ రుసుము, వినాయక ఆస్పత్రి బిల్లు, దిల్‌సుఖ్‌నగర్‌లోని వినాయక నర్సింగ్‌ కళాశాలలో 50 శాతం రాయితీ ఇస్తానని ప్రకటించారు. వినాయక కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆఫర్లు తాండూరులో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement