పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
పరిగి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పట్టణా లు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాడైన రోడ్లకు కనీస మరమ్మతులు కూడా చేయించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రోడ్లు బాగుపడ్డాయని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో పరిగి పట్టణంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మరో ఏడాదిలో పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు. పరిగిని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉంటే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, నాయకులు పార్థసారథి పంతులు తదితరులు పాల్గొన్నారు.


