ఆడారు.. సత్తాచాటారు | - | Sakshi
Sakshi News home page

ఆడారు.. సత్తాచాటారు

Feb 13 2026 5:39 AM | Updated on Feb 13 2026 5:39 AM

ఆడారు.. సత్తాచాటారు

ఆడారు.. సత్తాచాటారు

సీఎం కప్‌లో క్రీడాకారుల ప్రతిభ

38 విభాగాల్లో జరిగిన పోటీలు

రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమైన విజేతలు

హుడాకాంప్లెక్స్‌: శారీరక ధృడత్వానికే కాదు.. మానసికోల్లాసానికి తోడ్పడే క్రీడా పోటీలకు ప్రస్తుతం ప్రాధాన్యత పెరుగుతోంది. యువత పలు అంశాల్లో తమ ప్రతిభ చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి కప్‌–2026 పేరుతో పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి 18 వరకు మండల స్థాయి, ఈనెల 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు సరూర్‌నగర్‌ స్టేడియం వేదికై ంది.

8 నియోజకవర్గాలు..

1,500 మంది క్రీడాకారులు

జిల్లాలోని ఆమనగల్లు, షాద్‌నగర్‌, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాలకు చెందిన సుమారు 1,500 మంది యువ క్రీడాకారులు 38 అంశాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. బాలురు, బాలికల విభాగంలో విజేతలుగా, రన్నర్స్‌గా నిలిచారు. వీరంతా ఈనెల 20 నుంచి 24 వరకు గచ్చిబౌలి స్టేడియం కేంద్రంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

జిల్లా స్థాయి విజేతలు వీరే..

అభినందనీయం

క్రీడాకారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగ పడతాయి. ప్రభుత్వం సీఎం కప్‌ పేరుతో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు పాల్గొని విజయం సాధించాను. ఐదు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తపన.

– వేదాన్ష్‌, చెస్‌ జాతీయ క్రీడాకారుడు

విజయవంతంగా నిర్వహించాం

జిల్లా స్థాయి సీఎంకప్‌ 2026 పోటీలు విజయవంతంగా నిర్వహించాం. విజేతలు ఈనెల 20నుంచి గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. యువ క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొనడం అభినందనీయం. ప్రతి విద్యార్థి నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలి. అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం.

– వెంకటేశ్వర్‌ రావు, జిల్లా యువజన క్రీడాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement