ఇళ్ల మధ్య దుర్గంధం
కొడంగల్ రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల మధ్య మురుగుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతకొడంగల్, బూల్కాపూర్, ఐనన్‌పల్లి తదితర గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇటీవల గుండ్లకుంట గ్రామంలో డ్రైనేజ్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. బూల్కాపూర్‌లో కొంత కాలం క్రితం డ్రైనేజ్ పనులు ప్రారంభించి నిలిపేశారు. అధికారులు స్పందించి త్వరితగతిన డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పనులు ప్రారంభించాలి
గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా మారింది. వర్షా కాలంలో బురదమయంగా మారుతుంది. రహదారిలో మురుగు పారడంతో నడక సాగించేందుకు అవస్థలు పడుతున్నాం. అధికారులు, నాయకులు స్పందించి డ్రైనేజీ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
– రాజశేఖర్, పాతకొడంగల్
ఇళ్ల మధ్య దుర్గంధం


