వెల్లివిరిసిన భక్తిభావం
అంగరంగ వైభవంగా పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర బోనాలు, కోడి పుంజులుసమర్పించుకున్న భక్తులు
దుద్యాల్: పోలేపల్లిలో స్వయం భూగా వెలిసిన రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. శుక్రవారం భక్తులు అమ్మవారికి బోనాలు, కోడి పుంజులు సమర్పించారు. ఎల్లమ్మ దర్శనం కోసం తండోప తండాలుగా తరలివచ్చారు. గంటల కొద్ది క్యూలో ఉన్నారు. తెలంగాణ జిల్లాలతో పా టు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి, చైర్మన్ వెంకటేశ్ పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతి రెడ్డి దర్శించుకున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
నేత్రపర్వంగా సిడె
వరాల తల్లి.. పోలేపల్లి రేణుక ఎల్లమ్మ సిడె వేడుక శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. శివసత్తుల శిగాలు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. సిరుల తల్లి.. రేణుక ఎల్లమ్మ రావమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు. ఒగ్గుడోలు చప్పుళ్లతో జాతర ప్రాంగణం మార్మోగింది. గవ్వలు, పసుపు బండారు కలిపి సిడైపె చల్లారు. జాతర ప్రాంగణం జన సంద్రంగా మారింది. వికారాబాద్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేడు(శనివారం) రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సిడెకు తొట్టెల కట్టి ఉత్సవ మూర్తిని అందులో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు.
జన సంద్రం.. సిడె మహోత్సవం
వెల్లివిరిసిన భక్తిభావం
వెల్లివిరిసిన భక్తిభావం


