కాంగ్రెస్‌తో సొంతింటి కల సాకారం
తాండూరులో వందలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు త్వరలో మరో 1,500 మందికిపంపిణీ చేస్తాం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: పట్టణ ప్రజల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారమైందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 8, 13, 14, 16, 17, 18 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు కాలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో తాండూరుకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు థారాసింగ్, నాయకులు ముజిబ్‌ఖాన్, అబ్దుల్ రవూఫ్, రవిగౌడ్, వడ్డె శ్రీనివాస్, అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటాం
రానున్న మూడేళ్లలో తాండూరు మున్సిపాలిటీని ప్రగతి పథంలో నిలబెడతామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028 నాటికి మున్సిపాలిటీ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. అప్పటిలోగా రూ.550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. కాగ్నానది వద్ద రూ.30 కోట్లతో పంప్ హౌస్ నిర్మించి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. అమృత్ 2.0 ద్వారా రెండు ట్యాంక్‌లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ మురళీకృష్ణా గౌడ్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, నాయకులు అబ్దుల్ రవూఫ్, ఆమేర్ అబ్దుల్లా, వడ్డె శ్రీనివాస్, జుబేర్‌లాల, గౌరి రాములు తదితరులు పాల్గొన్నారు.


