బీఆర్‌ఎస్ బీఫాంల అందజేత
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు సోమవారం బీఫాంలు అందజేశారు. ఈ మేరకు వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జి మధుసూదనాచారి చేతుల మీదుగా ఆయా అభ్యర్థులు పత్రాలు అందుకున్నారు. 20మందికి పైగా అందజేశారు. మిగతా వారికి మంగళవారం ఇవ్వనున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ తదతరులు పాల్గొన్నారు.


