వైస్ చైర్మన్ రేసులో అబ్దుల్ రజాక్
తాండూరు: మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు విజ యం సాధించిన అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్ రేసులో నిలిచారు. 2014లో తొలిసారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అప్పట్లోనే వైస్ చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా కౌన్సిల్ ఏర్పాటుకు కోరం లేకపోవడంతో బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కౌన్సిల్ ఏర్పాటు చేశారు. 2020లో అదే వార్డు నుంచి బరిలోకి దిగి గెలిచారు. మూడో సారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వీర విధేయులుగా ఉన్న నాయకులు అబ్దుల్ రవూప్ సోదరుడికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో జనరల్ స్థానం నుంచి చైర్మన్‌గా లక్ష్మారెడ్డి కొనసాగగా వైస్ చైర్మన్‌గా ఎంఏ అలీం వైస్ చైర్మన్‌గా పని చేశారు. ఈ సారి అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అబ్దుల్ రజాక్‌కు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.


