కేంద్రం నిధులతోనే పురోగతి
పరిగి: బీజేపీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధలోని 18వ వార్డు అభ్యర్థి ముకుంద జ్యోత్స్న తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నా యకులు ముకుంద నాగేశ్ పాల్గొన్నారు.


