బీఆర్‌ఎస్ హయాంలో మెరుగైన వృద్ధి
తాండూరు టౌన్: తన హయాంలోనే పట్టణంలోని 23వ వార్డులో మెరుగైన అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్ అభ్యర్థి పరిమళ అన్నారు. సోమవారం ఆమె వార్డు పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో తాను కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వార్డు ప్రజల వైపు నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వార్డులోని పెద్దల నుంచి ఆశీర్వాదం, హామీ తీసుకుంటూ ప్రచారంలో ఆమె దూసుకు పోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు ప్రజలందరూ తన కుటుంబ సభ్యులని, వారి సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటానన్నారు. ఇంకా వార్డులో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించే అవకాశాన్ని ఓటర్లు తనకు ఇవ్వాలన్నారు.


