నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
తాండూరు రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి హెచ్చరించారు. పీహెచ్‌సీ వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవడం లేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి మంగళవారం 3గంటల ప్రాంతంలో పెద్దేముల్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన పీహెచ్‌సీకి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌తో పాటు వైద్యసిబ్బందితో సమావేశమయ్యారు. పీహెచ్‌సీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి


