ఆహార భద్రత మన బాధ్యత
అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి
అనంతగిరి: ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. లైసెన్స్ పొందిన తర్వాతే హోటళ్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, ఆహార భద్రత అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
ç³…^é-Ķæ$-¡-Æ>gŒæ ˘
ఈఈగా శ్రీనివాస్‌రెడ్డి
తాండూరు రూరల్: తాండూరు డివిజన్ పంచాయతీరాజ్ నూ తన ఈఈగా శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన సత్యనారాయణరెడ్డి పదోన్నతిపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈగా వెళ్లా రు. ఆయన స్థానంలో సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌రెడ్డి తాండూరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లోని ఆయా గ్రామాల్లో పెండింగ్ ఉన్న పనులను సత్వరం పూర్తయ్యేలా చూస్తామన్నారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసి ఎర్రమట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై 22 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
టాలెంట్ టెస్ట్‌లో
సత్తాచాటిన విద్యార్థులు
అనంతగిరి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని దోమ మండల ఎంఈఓ వెంకట్ అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌లో నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో దీపిక(జెడ్పీహెచ్‌ఎస్ ధారూర్)మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పరిహీన్(జెడ్పీహెచ్‌ఎస్ కిష్టాపూర్), తృతీయ స్థానంలో చైతన్య (జెడ్పీహెచ్‌ఎస్ దాదాపూర్) ఉండగా, తెలుగు మీడియంలో బిందు(జెడ్పీహెచ్‌ఎస్ నవల్గా), ఐశ్వర్య (జెడ్పీహెచ్‌ఎస్ సాల్వీడ్, ప్రవీణ్‌కుమార్ (జెడ్పీహెచ్‌ఎస్ బడెంపల్లి)ఉన్నారు. వీరందరికీ ఫోరం తరఫున బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం వీరకాంతం, డైట్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఆచారి, ఫోరం జిల్లా అధ్యక్షుడు బస్వరాజు, ప్రధాన కార్యదర్శి, సభ్యులు చంద్రమోహన్, యాదయ్య, సురేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, హన్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత మన బాధ్యత
ఆహార భద్రత మన బాధ్యత


