సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

Feb 3 2026 8:40 AM | Updated on Feb 3 2026 8:40 AM

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

● ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు ● సభాస్థలిని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 7న పరిగి పట్టణానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆదేశించారు. సోమవారం నారాయణపూర్‌ సమీపంలో సీఎం సభాస్థలిని ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ సభ ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముందొస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సభకు ఎంత మంది హాజరవుతారు.. ఎక్కడెక్కడి నుంచి వస్తారు.. ఎక్కడి వారికి అక్కడే పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఆర్‌అండ్‌బీ అధికారి శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వరీ, డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి

అనంతగిరి: మున్సిపల్‌ పరిధిలో ఓటు హక్కు ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మంగళవారంలోపు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందేందుకు సంబంధిత పత్రాలు సమర్పించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు ఫారం నింపి.. ఎలక్షన్‌ డ్యూటీ ఆర్డర్‌ కాపి, ఈపీఐసీ కార్డు కాపీ, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డును మున్సిపల్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

నిబంధనలకు లోబడే చైర్మన్ల ఎంపిక

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా చైర్మన్ల ఎంపిక నిబంధనలకు లోబడే చేపడతామని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్‌ చైర్మన్ల ఎంపికపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిబంధనల ప్రకారమే చైర్మన్‌ ఎంపిక ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమసింహారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement