‘రేడియల్’ సర్వే పనులు ప్రారంభం
భూ సేకరణపైగ్రామస్తులతో చర్చలు
దోమ: మండలంలోని పాలేపల్లిలో రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సోమవారం రేడియల్ రింగ్ రోడ్డు సర్వే పనులను ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్, నాచారం తోపాటు ఎన్‌హెచ్ –167 నుంచి బుద్వేల్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు రేడియల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా పాలేపల్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉన్న కొద్దిపాటి పొలాన్ని రేడియల్ రోడ్డుకు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని నిలదీశారు. స్పందించిన అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎంత భూమి అవసరం ఉంటుందో అంతే సేకరిస్తామని తెలిపారు. రైతుల సమ్మతితో సర్వే చేసి తీసుకుంటామని తెలిపారు. మరో సారి చర్చలు జరిపేందుకు వస్తామని, ఆలోగా ఆలోచించి నిర్ణయం చెప్పాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవిందమ్మ, సర్పంచ్ సుజాత, వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, హెచ్‌ఎండీఏ అధికారులు, డీఈఈ, ఏఈఈ, జీఈ నవీణ్, శ్రీవాత్సవ, ముక్రంఅలీ, సందీప్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


