తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
అనంతగిరి: తల్లి, ఇద్దరు పిల్లలు తప్పిపోయిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం పులుమద్దికి చెందిన అనురాధ తన ఇద్దరు పిల్లలు ప్రణీత్, రిత్విక్‌లతో కలసి అమ్మవారి ఊరైన దోమ మండలం వొట్పల్లి గ్రామానికి వెళ్లింది. తిరిగి గత నెల 22న పులుమద్దికి బయలుదేరింది. ఈ క్రమంలో వికారాబాద్ వరకు వచ్చారు. 2 గంటల సమయంలో బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. కానీ ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు.. వారి కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తల్లి చెన్నమ్మ ఈ నెల 3న పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రఘుకుమార్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వికారాబాద్ ఠాణాకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


