కొడంగల్ సింహాసనంపై నందారం?
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నందారం ప్రశాంత్ పేరు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వైస్ చైర్మన్ ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం మాజీ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డికే అవకాశం కల్పిస్తారా.. వేరొకరిని ఎన్నుకుంటారా అనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్తగా ఎన్నికై న 12 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11 గంటలకు కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్ ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
కొడంగల్ ఓటర్లు కొత్త వారికే పట్టం కట్టారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో పది మంది కొత్తవారే కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. గత మున్సిపల్ పాలక వర్గంలో చైర్మన్‌గా పని చేసిన జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌గా ఉన్న శంకర్‌నాయక్‌లు మాత్రమే రెండోసారి ఎన్నియ్యారు.
కొడంగల్ సింహాసనంపై నందారం?
కొడంగల్ సింహాసనంపై నందారం?


