వైస్‌.. రేస్‌! | - | Sakshi
Sakshi News home page

వైస్‌.. రేస్‌!

Feb 15 2026 12:38 PM | Updated on Feb 15 2026 12:38 PM

వైస్‌

వైస్‌.. రేస్‌!

8లోu

న్యూస్‌రీల్‌

ఒక్కొక్కరు మూడు నుంచి ఎనిమిది సార్లు గెలిచిన వారే

స్పీకర్‌కు అత్యంత ముఖ్యులు

తలనొప్పిగా మారిన ఎంపిక

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

రమేశ్‌కుమార్‌

వికారాబాద్‌: వికారాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎంపిక కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. ఫలితాలు కూడా వెల్లడైన నేపథ్యంలో అందరి దృష్టి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపికపై పడింది. కాంగ్రెస్‌ బీఫాంపై 17 మంది అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఒకరు.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒకరు కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో అధికార పార్టీ బలం 19కి చేరింది. చైర్‌పర్సన్‌ పీఠం దాదాపు ఆ పార్టీకే దక్కే అవకాశం ఉంది. పరిగి పురపాలిక సంఘంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చెరో ఎనిమిది వార్డులు కై వసం చేసుకున్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గెలుపొందారు. ఒకరు గులాబీ పార్టీకి మరొ కరు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో చైర్‌పర్సన్‌ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థి తి నెలకొంది. తాండూరు, కొడంగల్‌లో అధికార కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడంతో చైర్‌ పర్సన్‌ ఎవరనే దానిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఎటొచ్చి వైస్‌చైర్మన్లు ఎవరనేదే తేలా ల్సి ఉంది. ఈ విషయంలో ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే వికారాబాద్‌లో ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎవరికి అవకాఽశం ఇవ్వాలి...?ఎవరిని బుజ్జగించాలి అనేది ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

అందరూ హేమా హేమీలే...

వికారాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేసులో హేమా హేమీలు ఉండటంతో స్పీకర్‌కు తలనొప్పిగా మారింది. అందరూ నమ్మకస్తులే కావడం.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారు. గతంలో ఆ కుటుంబాల నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులు అలంకరించిన వారే. కొందరు కష్టకాలంలో పార్టీని ఆదుకోగా.. మరికొందరు ప్రసాద్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. వైస్‌ చైర్మన్‌ రేసులో ఐదారుగురు ఉండగా ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. పట్టణానికి చెందిన సత్యంసేట్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు. ఎనిమిది సార్లు కౌన్సిలర్‌గా.. ఒకసారి చైర్మన్‌గా, మూడు సార్లు వైస్‌చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేందర్‌ 23వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం సత్యంసేట్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరో నాయకుడు చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్‌ గతంలో నాలుగు సార్లు కౌన్సిలర్‌గా.. వైస్‌చైర్మన్‌గా పని చేశారు. ఈయన సతీమణి మంజుల ఇటీవలి వరకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఐదోసారి విజయం సాధించిన ఆయన కూడా రేసులో ఉన్నారు. మరోనేత లంక లక్ష్మీకాంత్‌రెడ్డి ఈయన రెండోసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గతంలో ఈయన సతీమణి పుష్పలత చైర్‌పర్సన్‌గా పనిచేయగా ఇప్పుడు లక్ష్మీకాంత్‌రెడ్డి పదవి ఆశిస్తున్నారు. మరో సీనియర్‌ నేత ఆర్థ సుధాకర్‌రెడ్డి ఈయన వరుసగా మూడుసార్లు గెలుపొందారు. గతంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ పట్టణ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో కూడా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో ఉంటూ సేవలందించారు. ఈయన కూడా రేసులో ఉన్నారు. దీంతో ఎంపిక జఠిలమైంది. వైస్‌ చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందనేది 16వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

రాఘవేందర్‌

సుధాకర్‌రెడ్డి

లక్ష్మీకాంత్‌రెడ్డి

ఎంపిక పెద్ద సవాల్‌

వైస్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారందరూ స్పీకర్‌కు అత్యంత ముఖ్యులే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్‌కుమార్‌ గెలుపునకు శ్రమించారు. ఎంతో నమ్మకమై న నేతలు కూడా.. సుధాకర్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్‌, సత్యంసేట్‌,రాంచంద్రారెడ్డి, లంకా లక్ష్మీకాంత్‌రెడ్డి, కిషన్‌ నాయక్‌, గుడిసె లక్ష్మణ్‌, రత్నారెడ్డి, ధారూ రు మండలానికి చెందిన రఘువీరారెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన నరోత్తంరెడ్డి, మర్పల్లి మండలానికి చెంది కొండల్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయగా.. కొందరు ఓటమి పాల య్యారు. గెలిచిన నలుగురు వైస్‌చైర్మన్‌పై ఆశలు పెట్టుకున్నారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తన రాజకీయ వారసురాలిగా రంగప్రవేశం చేసిన కూతురు అనన్యను చైర్‌పర్సన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతా కావాల్సిన వారే రేసులో ఉండటంతో వైస్‌ చైర్మన్‌ ఎంపిక పెద్ద సవాల్‌గా మారినట్లు తెలిసింది. ఎవరినీ నొప్పించకుండా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. వైస్‌ చైర్మన్‌ ఎవరనేది 16వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

వికారాబాద్‌ పుర వైస్‌ చైర్మన్‌ ఆశావహుల్లో హేమా హేమీలు

వైస్‌.. రేస్‌!1
1/6

వైస్‌.. రేస్‌!

వైస్‌.. రేస్‌!2
2/6

వైస్‌.. రేస్‌!

వైస్‌.. రేస్‌!3
3/6

వైస్‌.. రేస్‌!

వైస్‌.. రేస్‌!4
4/6

వైస్‌.. రేస్‌!

వైస్‌.. రేస్‌!5
5/6

వైస్‌.. రేస్‌!

వైస్‌.. రేస్‌!6
6/6

వైస్‌.. రేస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement