ఆటో బోల్తా: పలువురికి గాయాలు
యాలాల: మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం మండలంలోని అచ్యుతాపూర్ గేటు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాయిపేట నుంచి తాండూరు వైపు వెళుతున్న ట్రాలీ ఆటో, మార్గమధ్యలో అచ్యుతాపూర్ గేటు మూలమలుపు వద్ద అదుపు తప్పింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో తాండూరుకు తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
● కష్టపడిన వారికి అవకాశం
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు: సంప్రదాయ రాజకీయాలకు చెక్ పెట్టి, పార్టీ కోసం కష్టపడిన వారికి మున్సిపాలిటీ ఎన్నికల్లో అవకాశం కల్పించానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 6వ వారు నుంచి 10వ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని, బీఆర్‌ఎస్‌ను ఆదరిస్తే.. అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. రెండేళ్ల వ్యవధిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. పాత తాండూరు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను మీ ఇంటి బిడ్డగా భావించి గెలిపించాలని కోరారు. అనంతరం 6వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనేఅభివృద్ధి సాధ్యం
ఆటో బోల్తా: పలువురికి గాయాలు


