న్యాయం చేయాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని నిరసన

Feb 11 2026 8:51 AM | Updated on Feb 11 2026 8:51 AM

న్యాయం చేయాలని నిరసన

న్యాయం చేయాలని నిరసన

చేవెళ్ల: అడ్వకేట్‌ స్వప్న హత్యపై తక్షణం న్యాయం చేయాలని చేవెళ్ల బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. మంగళవారం చేవెళ్ల బార్‌ అసోసియేషన్‌, సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిల పిలుపు మేరకు హైకోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నియమాకంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్‌ భద్రత కల్పించకపోవటం, వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చడం లాంటి నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో చేవెళ్ల న్యాయవాదులతోపాటు తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్‌ సభ్యులు, బార్‌ కౌన్సిల్‌ మెంటర్‌ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement