అభివృద్ధే మా నినాదం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే మా నినాదం

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

అభివృ

అభివృద్ధే మా నినాదం

కొడంగల్‌ మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి నందారం ప్రశాంత్‌

కొడంగల్‌: మున్సిపల్‌ పరిధిలోని 12 వార్డులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్‌ పురపాలిక సంఘం కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి నందారం ప్రశాంత్‌ అన్నారు. నాలుగో వార్డు నుంచి విజయం సాధించిన ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.

ప్రశ్న: మీ విజయానికి ఏయే అంశాలు

కలిసొచ్చాయి?

జవాబు: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కారణం. పట్టణ పరిధిలో రూ.100 కోట్లతో అనేక పనులు జరుగుతున్నాయి. ప్రజలు మెచ్చి 10 మంది అభ్యర్థులను గెలిపించారు.

ప్ర.: మీ వార్డులో గుర్తించిన సమస్యలు ఏంటి?

జ.: పట్టణంలోని గాంధీనగర్‌ తోపాటు గుండ్లకుంట గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను గుర్తించాం. త్వరలో అంతర్గత రోడ్లు, మురు గు కాల్వల నిర్మాణం చేపడతాం.

ప్ర.: తొలి ప్రాధాన్యత దేనికి ?

జ.: పాలక మండలి ప్రమాణ స్వీకా రం చేసిన వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రఽ దాన సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కరిస్తాం

ప్ర.: మీరు ఇచ్చిన హామీలు ఏంటి?

జ.: అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పిస్తాం. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

ప్ర.: ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?

జ.: రానున్న రెండేళ్లలోపు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. అన్ని సమస్యలు తీరుస్తాం.

అభివృద్ధే మా నినాదం 1
1/1

అభివృద్ధే మా నినాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement