మీ బిడ్డగా వస్తున్నా.. ఆదరించండి | - | Sakshi
Sakshi News home page

మీ బిడ్డగా వస్తున్నా.. ఆదరించండి

Feb 10 2026 9:50 AM | Updated on Feb 10 2026 9:50 AM

మీ బిడ్డగా వస్తున్నా.. ఆదరించండి

మీ బిడ్డగా వస్తున్నా.. ఆదరించండి

● వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం అనన్య ● పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం

అనంతగిరి: ‘మీ బిడ్డగా వస్తున్నా.. తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం అనన్య అభ్యర్థించారు. సోమవారం పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే వికారాబాద్‌ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కూతురిగా తనకు రాజకీయాలపై అవగాహన ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ సమస్యలు తనకు తెలుసని.. ప్రజల సూచనలు, సలహాలతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement