కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్
కొడంగల్: కొడంగల్ రెండో వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ యాదవ్ శనివారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ శాలువా పూలదండతో వాణిశ్రీని సన్మానించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొడంగల్‌లో విజయం సాధించినందుకు అభినందించారని మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ గట్టు రాంచంద్రారావ్, భీములు, చిన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్
కౌన్సిలర్లకు సన్మానం
అనంతగిరి: బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సన్మానించారు. శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై పరిష్కారంలో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
నేత్రపర్వం..
శివపార్వతుల కల్యాణం
షాద్‌నగర్: ç³rt-׿…ÌZ° àh-ç³-ÍÏ Æøyýl$zÌZ Ñf-ÄŒæ$-¯]l-VýS-ÆŠ‡-M>-ÌS-±ÌZ E¯]l² }ÒÆ>…-f¯ólĶæ$ çÜçßæç܈ Í…VóS-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ §ólÐé-ÌS-Ķæ$…ÌZ BÌSĶæ$ MýSÑ$sîæ A«§ýlÅ„ýS$yýl$ EÐ]l*-Ôèæ…-MýS-ÆŠ‡-Æð‡yìlz B«§ýlÓÆý‡Å…ÌZ Ôèæ°-ÐéÆý‡… ÕÐ]l-´ëÆý‡Ó-™èl$ÌS MýSÌêÅ×ê°² OÐðl¿¶æÐ]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. ¿ýæMýS$¢ Ë$ ò³§ýlªçÜ…-QÅÌZ ™èlÆý‡Í-Ð]l-_a ç³NfË$ ^ólÔ>Æý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Mú°Þ-ÌSÆŠ‡ ´ëÅr AÔZMŠS, AÀ-Ð]l–¨® MýSÑ$sîæ VúÆý‡Ð]l A«§ýlÅ„ýS$yýl$ »êÌS-Vø-´ëÌŒæ, {糿ê-MýS-ÆŠ‡Æð‡yìlz, Ððl…MýSsŒæÆð‡yìlz, »êÌSĶæ$Å, ÝùÐól$ÔŒæ, }°-Ðé‹Ü, çÜ$Æó‡…§ýlÆŠ‡-Æð‡yìlz, ºÌSÓ…-™Œæ-Æð‡yìlz ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘
న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలి
చేవెళ్ల: న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే చట్టం అమలు చేయాలని ప్రముఖ న్యాయ వాది కె.అశోక్ డిమాండ్ చేశారు. చేవెళ్లలోని కో ర్టు వద్ద బార్ అసోషియేషన్ సభ్యులు చేస్తున్న రిలే దీక్షకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభు త్వం చట్టం అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదులపై హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటి నుంచి రక్షణ కోసం చట్టం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సత్యానందం, జైపాల్, శ్రీనివాస్, ప్రకాశం, రవీందర్, సాయిరామ్, మహేశ్ పాల్గొన్నారు.
శివాలయం ముస్తాబు
చేవెళ్ల: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని కొనగట్టు శివాలయం ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆదివారం ఉపవాస దీక్షలతో భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం వద్ద అభిషేకాలు, భజనలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని శివాలయాలు, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్


