సీఎంకు ఘన స్వాగతం
దోమ: పరిగి మండలానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి వచ్చారు. వారిని నారాయణపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు తీసుకెళ్లారు.
సైడ్ లైట్స్
● మధ్యాహ్నం 3.30గంటలకు పరిగి మండలం రాంరెడ్డిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం హెలికాప్టర్ చేరుకుంది.
● 3.33 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగి సభాస్థలికి బయలుదేరారు.
● 4.22 గంటలకు ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో ప్రసంగించారు.
● 44 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
● 5.06 గంటలకు ప్రసంగం ముగించి అక్కడి నుంచి తిరిగి హెలిపాడ్ వద్దకు 5.12 నిమిషాలకు చేరుకున్నారు.
● కాసేపు బస్సులో విశ్రాంతి తీసుకున్నారు.
● 5.25 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు.


