బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిందేమిటో చెప్పాలి
మొయినాబాద్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్ ప్రశ్నించారు. మొయినాబాద్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 1.85 లక్షల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రెండు సార్లు ఎంపీగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అజీజ్‌నగర్, ఎనికేపల్లి, మొయినాబాద్‌లో మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహాడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తదితరులు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్


