శివారు అధ్వానం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివారు వార్డులు మినహా మిగతా వాటిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. అక్కడక్కడ మాత్రం సరిపడా మురుగు కాలువలు లేవు. దీంతో వర్షాకాలంలో నీరంతా రోడ్లపై చేరుతోంది. అండర్ డ్రైనేజీ కూడా పలుచోట్ల స్తంభిస్తోంది. మున్సిపల్ పరిధిలోని శివారు గ్రామాలైన ధన్నారం, మద్గుల్ చిట్టంపల్లి, గుడుపుల్లి, బురుగుపల్లి, గిరిగేట్‌పల్లిలతో మురుగు కాల్వలు అధ్వానంగా మారాయి. నిత్యం దుర్వాసన వ్యాపించి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
దోమల స్వైరవిహారం
మున్సిపల్ పరిధిలోని మిగతా వార్డుల మాదిరిగా మా గ్రామంలో సైతం అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం దోమల స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్ల వెంబడి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైన చోట కొత్త మురుగు కాల్వలు నిర్మించాలి. నూతన పాలకవర్గం ఈ సమస్యను పరిష్కరించాలి.
– శ్రీనివాస్, వికారాబాద్


