ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
అనంతగిరి: బాధ్యతగా పని చేసి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలను విజయంతంగా పూర్తి చేద్దామని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు బాధ్యగా పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామగ్రిని సరి చూసుకోవాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ నోడల్ అధికారి మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు విక్రంసింహారెడ్డి, నాగరాజు, నటరాజు పాల్గొన్నారు.


