కాంగ్రెస్‌కు జై | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు జై

Feb 15 2026 12:38 PM | Updated on Feb 15 2026 12:38 PM

కాంగ్రెస్‌కు జై

కాంగ్రెస్‌కు జై

● రెండు దశాబ్దాల తర్వాతపట్టం కట్టిన ఓటర్లు ● హస్తం పార్టీకి వచ్చిన ఓట్లు 21,647 ● బీఆర్‌ఎస్‌కు 18,608

తాండూరు: రెండు దశాబ్దాల తర్వాత తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌ పార్టీ వశమైంది. పట్టణ పరిధిలోని 36 వార్డులు.. 77,025 మంది ఓటరు్‌ల్‌ ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో 52,025 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌కు 21,647 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 18,608, బీజేపీకి 5,212, ఎంఐఎం పార్టీకి 3,723 ఓట్లు పడ్డాయి. 2020 ఎన్నికల్లో బీజేపీకి 7,582 ఓట్లు రాగా ఈ సారి 5,212 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఎంఐఎం పార్టీకి 7,199 ఓట్లు రాగా ఈ సారి 3,723 ఓట్లు వచ్చాయి.

మెజార్టీ స్థానాలు

రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. 2005లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కు వచ్చాయి. అప్పట్లో చైర్మన్‌గా పీ లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సార్లూ కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 2014లో 10 వార్డులకే పరిమితమైంది. 2020లో కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొంది చైర్మన్‌ పీఠాన్ని తన ఖాతాలో వేసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement