ముక్కుపుటాలు అదిరేలా..!
మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
పరిగి: మున్సిపాలిటీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీలన్నీ కంపుకొడుతున్నాయి. పేరుకే పరిగి పెద్ద మున్సిపాలిటీ అని అభివృద్ధిలో మాత్రం దారుణంగా ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. విద్యానగర్ కాలనీ, తుంకుల్‌గడ్డ, బాలాజీనగర్, మైత్రినగర్, మందుల కాలనీ, ఇలా చాలా కాలనీలో మురుగు కాలువలు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు మొత్తం ఇళ్ల మధ్యలోనే నిలుస్తుంది.అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపైనే పారుతోన్న మురుగునీరు
కంపు కొడుతున్న కాలనీలు
దుర్గంధంతో స్థానికుల ఇబ్బందులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
పురపాలిక సంఘాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అదుపు తప్పుతోంది. మురుగునీటి పారుదల, దానికి అనుసంధానంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పట్టణవాసుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పన్నులు కట్టేటప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మురుగు సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అవస్థలు పడుతున్నాం
మా కాలనీలో మురుగు కాలువలు లేక నానా అవస్థలు పడుతున్నాం. కాలువలు నిర్మించాలని అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంటి ఎదుటే వ్యర్థాలు నిలుస్తున్నా తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈగలు, దోమలు ఇళ్లల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి మురుగు కాలువలు వెంటనే నిర్మించాలి.
– ఎండీ.షాహెద్, విద్యానగర్‌కాలనీ
ముక్కుపుటాలు అదిరేలా..!
ముక్కుపుటాలు అదిరేలా..!
ముక్కుపుటాలు అదిరేలా..!


