ప్రజాప్రభుత్వానికి అండగా ఉండండి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణ అభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. అనంతగిరిని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తానన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయా ణం, వడ్డీలేని రుణాలు అందించి సంక్షేమ పాలన అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మైపాల్‌రెడ్డి, కిషన్‌నాయక్, సత్యనారాయణ, కొండల్‌రెడ్డి, షరీఫ్, ముత్యంరెడ్డి, నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్


