సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు డిజిటల్ ‘కీ’
బషీరాబాద్: సర్పంచ్‌లు నిధుల డ్రా కోసం చెక్కుల పై పెట్టే మాన్యువల్ సంతకాలకు చెక్ పడబోతుంది. ఇకపై సర్పంచ్, ఉప సర్పంచ్‌లు డిజిటల్ సంతకాలు పెట్టబోతున్నారు. గతంలో పంచాయతీకి సంబంధించిన నిధుల డ్రాకు సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ సంతకాలతో చెక్‌తో విత్‌డ్రా చేసేవారు. గతంలో ఉప సర్పంచ్ సంతకాలు ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరికీ డిజిటల్ సంతకాల కీ అందజేస్తున్నా రు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే కీలు తయారు చేసి ఎంపీడీఓ కార్యాలయకు చేర్చింది. ఎంపీడీఓలు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు గుర్తింపు కార్డులు సైతం జారీ చేస్తున్నారు. వీటిని త్వరలోనే సర్పంచ్‌లకు అందజేయనున్నట్లు బషీరాబాద్ ఎంపీడీఓ సంపత్‌కుమార్ తెలిపారు.
మాన్యువల్ సంతకాలకు స్వస్తి
సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు డిజిటల్ ‘కీ’


