జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయం

Feb 13 2026 5:39 AM | Updated on Feb 13 2026 5:39 AM

జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయం

జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయం

టీఆర్‌జేకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

వంగా శ్రీనివాస్‌గౌడ్‌

సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

పరిగి: జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిరంతరం పని చేస్తోందని ఆసంఘం(టీఆర్‌జేకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని శ్రీసత్యసాయి మందిరంలో గురువారం సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లా కమిటీ చేస్తున్న పనులను ప్రశంసించారు. సంఘం నూతనంగా అమలు చేయబోతున్న సంక్షేమ నిధి వివరాలను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు విజయశ్రీ వివరించారు. సంఘం బలోపేతానికి మరింత కృషి చేయాలని రాష్ట్ర కమిటీ ప్రతినిధి కవిత సూచించారు.

జిల్లా అధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్య

ఈమేరకు జిల్లాలోని 15జానపద కళారూపాలున్న అందరిని చేర్చి అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా పరిగి వెంకటేశ్‌, కోశాధికారిగా కొడంగల్‌ నరేశ్‌, ఉపాధ్యక్షులుగా వెంకటయ్య, హన్మయ్య, చిన్నయ్య, సంసయుక్త కార్యదర్శులుగా వెంకటయ్య బసప్ప రాములు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా వెంకటయ్య, నర్సింలు, అనంతయ్య, ప్రచార కార్యదర్శులుగా రఘు, శివకుమార్‌, రాములు, చెన్నయ్య, ముఖ్య సలహాదారులుగా గంజిపల్లి పెద్ద రాములు, మల్లేశం, వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు.

అధ్యక్షురాలిగా శోభారాణి

దోమ మండలం కిష్టాపూర్‌కు చెందిన శోభారాణి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానకార్యదర్శిగా ధారూరుకు చెందిన సీహెచ్‌ లలిత, కోశాధికారిగా తులసి, గౌరవ అధ్యక్షురాలిగా మాధవి, ఉపాధ్యక్షురాళ్లుగా రజిత, అంజిలి, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్‌ స్వప్న, కార్యనిర్వహణ కార్యదర్శులుగా వినోద, మంజుల, అపురూప, ప్రచార కార్యదర్శులుగా లావణ్య, అనురాధ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి రంగాపూర్‌ వ్యవస్థాపకులు వెంకట్‌రెడ్డి, నిర్వహకులు చిన్నయ్య ఆయా మండలాల ప్రతనిధులు మెట్లకుంట వెంకటయ్య, అనంతయ్య, హన్మయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement