నెలాఖరుకు సీఎంఆర్ బియ్యం అందజేయాలి
● అదనపు కలెక్టర్ రాజేశ్వరి
● పీఏసీఎస్, బాలాజీ రైస్‌మిల్లుల తనిఖీ
యాలాల: సీఎంఆర్ బియ్యాన్ని ఫిబ్రవరి 28వ తేదీలోపు ఎఫ్‌సీఐలకు డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ రాజేశ్వరి ఆదేశించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని పీఏసీఎస్, బాలాజీ రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. పీఏసీఎస్ రైస్‌మిల్‌లో రూ.53 లక్షలు వెచ్చించి మిషన్ కొనుగోలు చేసిన సమయంలో అవకతవకలు జరిగాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సీఈఓ వేణును విచారించారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎంత ఖర్చయిందని తదితర విషయాలను తెలుసుకన్నుఆరు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని బాలజీ రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. ఆమె వెంట డీసీఓ నాగార్జున, వ్యాపారి బాలేశ్వర్‌గుప్తా ఉన్నారు.


