ఆలయ వార్షికోత్సవాలకు హాజరైన స్పీకర్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని వెంకటపూర్ తండాలో జగదాంబ భవాని మాత, జగద్గురు సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన ఉత్సవాల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్‌ను సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిషన్‌నాయక్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: జాతీయ స్థాయి జూనియర్ మహిళల ఘాటింగ్ బాల్ టోర్నీకి ఐనెల్లి శివారు కేజీబీవీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఇందు ఎంపికై ంది. జనవరి 17, 18వ తేదీల్లో తాండూరులో రాష్ట్రస్థాయి సౌత్ జోన్ జూనియర్ ఘాటింగ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఇందును జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని పాఠశాల ఎస్‌ఓ ఆశలత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఇందు తలపడుతుందని చెప్పారు.
ఆలయ వార్షికోత్సవాలకు హాజరైన స్పీకర్


