మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీలకు 2026–27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న అడ్మిషన్ టెస్ట్ ఉంటుందని చెప్పారు.
వందశాతం సబ్సిడీపై రూ.75వేల ఆర్థికసాయం
అనంతగిరి: ట్రాన్స్‌జెండర్ల పునారావాసం కోసం వంద శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని బి.కృష్ణవేణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో అర్హులైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు రూ.75వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న అర్హులు అవసరమైన ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లోని మహిళ, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ శాఖ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య
అనంతగిరి: ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వికారాబాద్ ప్రభుత్వాస్పత్రి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం కార్మికచట్టాలను కాలరాస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లాలోని కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కొడంగల్ రూరల్: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని యువతకు 5వ తేదీన గురువారం పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) ఆవరణలో అసెంబ్లీ లెవల్ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సీఎం కప్ పోటీల ఇన్‌చార్జి ఎం.అనిల్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో (18 ఏళ్ల లోపు) వాలీబాల్, ఖోఖో, సీనియర్ విభాగంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 6న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత ఆయా రోజుల్లో ఉదయం 9గంటలకు పాఠశాల ఆవరణలో హాజరుకావాలన్నారు.
డీఏఓ రాజారత్నం
అనంతగిరి: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌తో యూరియా విక్రయాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 31 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో యాప్ ద్వారా పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులు 9,103 బ్యాగులు, డిజిటల్ సంతకం లేని రైతులు 12 బ్యాగులు, కౌలురైతులు 29 బ్యాగులు కొనుగోలు చేయగా మొత్తం 9,144 బ్యాగులు విక్రయించారని చెప్పారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలుతో రైతులు లైన్లలో వేచియుంవాల్సిన అవసరం లేకుండా పోయిందని, జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలపై పూర్తి పారదర్శకత లభిస్తోందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ కట్టుబడి ఉందన్నారు. రైతులందరూ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను వినియోగించుకొని తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందాలన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మొయినాబాద్: ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిప ల్ పరిధిలోని చిలుకూరు ఇంద్రారెడ్డి కాలనీ లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


