పట్టణ రూపురేఖలు మారుస్తా | - | Sakshi
Sakshi News home page

పట్టణ రూపురేఖలు మారుస్తా

Feb 8 2026 7:58 AM | Updated on Feb 8 2026 7:58 AM

పట్టణ రూపురేఖలు మారుస్తా

పట్టణ రూపురేఖలు మారుస్తా

చైర్‌పర్సన్‌ అభ్యర్థి గడ్డం అనన్య

పాల్గొన్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి గడ్డం అనన్య అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని, వాటిని పరిష్కరించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సమస్యపై అవగాహన ఉందన్నారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సహకారంతో వికారాబాద్‌ పట్టణ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. తనతోపాటు పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement