రెండోసారి హస్తగతం
● ఈసారి కాంగ్రెస్‌దే షాద్‌నగర్ మున్సిపల్ పీఠం
● 15 వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు
● హోరాహోరీ పోరులో 11చోట్ల గెలుపొందిన బీఆర్‌ఎస్
షాద్‌నగర్: ముచ్చటగా మూడు సార్లు జరిగిన మున్సిప ల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2020 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన మెజార్టీ కౌన్సిలర్లు విజయం సాధించారు. దీంతో మొదటి సారి చైర్మన్ పీఠాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఆతర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 28 వార్డులకు గాను 19 చోట్ల గెలుపొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేశారు. మూడోసారి నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ 11 చోట్ల గెలుపొందింది. 15 వార్డుల్లో విజ య దుందుబి మోగించిన కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది.
పుర పీఠం ఎవరికి దక్కేనో..
షాద్‌నగర్‌లో అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. అగ్గునూరు బస్వం, మో హన్ చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ కొత్త గా ఎన్నికైన కౌన్సిలర్లే కావడం గమనార్హం. లేదంటే గతంలో చైర్మన్‌గా పని చేసిన అగ్గునూ రు విశ్వం సతీమణి విశాలకు అవకాశం కల్పిస్తారా వేచిచూడాల్సిందే. వీరెవరినీ కాదని, అధిష్టానం మరెవరివైపైనా మొగ్గు చూపుతుందా అనేది సోమవారం తేలనుంది.ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మె ల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ వీరి నిర్ణయమే కీలకం కానుంది.
క్యాంపు రాజకీయాలు..
కాంగ్రెస్ కౌన్సిలర్లును పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రే మేడ్చల్ శివారులోని ఓ రిసార్ట్‌కు తరలించింది. 16న కౌన్సిలర్లను క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం తమ అభ్యర్ధులను క్యాంపునకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులు కారు దిగి, హస్తం గూటికి చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.


