వైభవం.. ఎల్లమ్మ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. ఎల్లమ్మ రథోత్సవం

Feb 15 2026 12:38 PM | Updated on Feb 15 2026 12:38 PM

వైభవం.. ఎల్లమ్మ రథోత్సవం

వైభవం.. ఎల్లమ్మ రథోత్సవం

దుద్యాల్‌: పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శనివారం అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభంగా సాగింది. ఎల్లమ్మను తేరులో ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బుడగ జంగాలు, గొల్ల కురుమలు, బైండ్ల వారు అమ్మవారి కీర్తిని ఆట పాటలతో వివరించారు. వేడుకల్లో ఆలయ చైర్మన్‌ ముచ్చటి వెంకటేష్‌, ఈఓ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది పనితీరు భేష్‌

జాతర ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది, మల్టీపర్పస్‌ వర్కర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బాగా పనిచేశారని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ అన్నారు. శనివారం ఆమె అధికారులతో కలిసి జాతర వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు తాగునీరు. పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అభినందించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీఓ జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement