పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

● జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్‌

మోమిన్‌పేట: పండ్ల తోటలకు ఉపాధి హామీ పథ కం కింద ప్రోత్సహిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని మొరంగపల్లి పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, మోమిన్‌పేటలో రైతు చారి సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను పరిశీలించి మాట్లాడారు. ఉపాధి పథకం కింద తోటల పెంపకానికి నిధులు ఇస్తామన్నారు. జామ, మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, రేగు, అరటి, బొప్పాయి తదితర తోటలకు అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.60 వేల వరకు ఉపాధి నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్‌బీఎం ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అందుకు రూ.12 వేలు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోని పక్షంలో మండల మహిళా సమాఖ్య, గ్రామ సమాఖ్య, బ్యాంకు, సీ్త్రనిధి నుంచి రుణంఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సృజన సాహిత్య, ఏపీఓ శంకర్‌, ఈసీ వికాస్‌, టీఏలు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement