మహిళ ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
ఖమ్మంవైద్యవిభాగం: ఎండదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళకు ప్రాణం పోశారు 108 సిబ్బంది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఆదివారం ప్రమీల (55) ఎండలో పనిచేస్తుండగా బీపీ పూర్తిగా తగ్గిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా.. మెడికల్ టెక్నీషియన్ జాటోతు విజయలక్ష్మి, పైలట్ ఆనందరావు ప్రమీలకు వైద్య పరీక్షలు చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. 108లోనే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని గ్రామస్తులు, ప్రమీల కుటుంబ సభ్యులు, 108 మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ అభినందించారు.


