తల్లిదండ్రుల అభీష్టం మేరకే
పైచదువులు..
డిగ్రీ కోర్సులకు తగ్గుతున్న ఆదరణ
తమ నిర్ణయానికి వదిలేస్తే
రాణిస్తామంటున్న విద్యార్థినులు
స్నేహితుల సూచన
సమాజం
68
24
8
మా తల్లిదండ్రుల నిర్ణయం
కుటుంబం
నా సొంత నిర్ణయం
ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే..
తమ పిల్లలు ఇంటర్ పూర్తి చేయగానే వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులకే తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డిగ్రీ(బీఎస్సీ) కోర్సుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉన్నా.. ఆ దిశగా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ సగం మంది విద్యార్థినులు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు, మిత్రులు, ఇతర కుటుంబ పెద్దల సలహాలు, సూచనలతోనే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. అయితే మేజర్లమైన తమకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తే తమకు ఆసక్తి గల కోర్సులు చదివి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. సొంత నిర్ణయంతోనే రాణించగలమని చెబుతున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే విద్య ఎంతో ముఖ్యం. అయితే ఇప్పటికీ సగం మంది విద్యార్థినులు తమ సొంత నిర్ణయంతో కాకుండా తల్లిదండ్రుల అభీష్టం మేరకే కోర్సులను ఎంచుకుంటున్నారు. ఒకవేళ తమకు ఆసక్తి గల కోర్సులు చదవాలన్నా తల్లిదండ్రులను ఒప్పించడం వారికి అంత సులభం కావడం లేదు. సొంత నిర్ణయాలతో చదివే వారు సగం మంది వరకే ఉన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 18 – 25 ఏళ్ల మధ్య వయసు గల పలువురు విద్యార్థినులను ‘సాక్షి’ శనివారం ప్రశ్నించగా తమ మనోగతాన్ని పంచుకున్నారు.
– ఖమ్మం సహకారనగర్/కొత్తగూడెం అర్బన్
నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సర్వే


