ఖమ్మంమయూరిసెంటర్ : యుద్ధం సాకుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచి సామాన్యులపై ఆర్థిక భారం వేయడం తగదని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేష్ అన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రెండు పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరాన్–అమెరికా యుద్ధం ప్రారంభ దశలో వంట గ్యాస్ కొన్ని నెలల కు సరిపడా నిల్వ ఉందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పేదలపై భారం వేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీది ఎప్పుడూ కార్పొరేట్, సంపన్న వర్గాల పక్షమేనని మరోసారి తేలిపోయిందన్నారు. భారత్‌కు మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉండటం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, నాయకులు మాచర్ల భారతి, యర్రా శ్రీనువాసరావు, మెరుగు సత్యనారాయణ, మీరా సాహిబ్, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్ రెడ్డి, బోడపట్ల సుదర్శన్, సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కే జానిమియా, ఏపూరి లతాదేవి, తోట రామాంజనేయులు, పగడాల మల్లేష్, సీహెచ్ సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాస్, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధర పెంపుపై
సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన


