●నాడు కట్టడాలు.. నేడు శిథిలాలు
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఏళ్లుగా కొందరు ఇళ్లు నిర్మించుకుంటూ
వస్తున్నారు. స్థోమతకు తగ్గినట్లుగా ఎవరికి వారు గుడిసెలు, రేకుల షెడ్లు, స్లాబ్‌తో ఇళ్లు
నిర్మించుకుని వినోబా నవోదయ నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు. దీంతో ఇన్నాళ్లు
ఖమ్మం – వైరా ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఇళ్ల సముదాయం కనిపించేది. అయితే, ఈనెల 24న కాలనీలోని ఇళ్లను అధికార యంత్రాంగం కూల్చేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం
మీదుగా వెళ్తుంటే నేలమట్టమైన ఇళ్ల శిథిలాలే కనిపిస్తున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


