భూదాన్‌ భూములు నిరుపేదలకే దక్కాలి | - | Sakshi
Sakshi News home page

భూదాన్‌ భూములు నిరుపేదలకే దక్కాలి

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

భూదాన్‌ భూములు నిరుపేదలకే దక్కాలి

భూదాన్‌ భూములు నిరుపేదలకే దక్కాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: దశాబ్దం క్రితం పేదలు భూదాన్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే కనీస వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించడం గర్హనీయమని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నా రు. ఇకనైనా ఆ భూములను శాశ్వతంగా వారికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో శుక్రవారం మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు అక్కడే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడంతో పాటు తక్షణ సాయంగా రూ.5లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, సీవై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్‌, కొల్లేటి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య, ఆర్‌.శివలింగం, ఏ.వెంకన్న, శిరోమణి, ఝాన్సీ, మంగతాయి, ఎం.నాగేశ్వరరావు, కమ్మకోటి నాగేశ్వరరావు, తిమ్మిడి హన్మంతరావు, కె.శ్రీను, లాజర్‌, ఆజాద్‌ పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement